Share News

POLL : మడకశిరలో 74.25 శాతం పోలింగ్‌

ABN , Publish Date - May 14 , 2024 | 01:27 AM

చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గంలో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 241 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగిం చుకొనేందుకు బారులు తీరారు. ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగినా మధ్యా హ్నం నుంచి పుంజుకొంది. ఉదయం 9 గంటలకు 3.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా 11 గంటలకు 29 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 46.20 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 63.40 శాతం నమోదైంది. 4 గంటలకు 66.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 71.25 శాతం, 6 గంటలకు 74.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

POLL : మడకశిరలో 74.25 శాతం పోలింగ్‌
Voters standing in a queue in Madakasira

మడకశిరలో 74.25 శాతం పోలింగ్‌

మడకశిర/మడకశిరటౌన, మే 13: చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గంలో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 241 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగిం చుకొనేందుకు బారులు తీరారు. ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగినా మధ్యా హ్నం నుంచి పుంజుకొంది. ఉదయం 9 గంటలకు 3.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా 11 గంటలకు 29 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 46.20 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 63.40 శాతం నమోదైంది. 4 గంటలకు 66.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 71.25 శాతం, 6 గంటలకు 74.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా నియోజక వర్గం వ్యాప్తంగా 144 సెక్షన విధించారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. వలస ఓటర్లు సైతం ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. వృద్ధులకు ఇళ్లవద్దే ఓటు హక్కును విని యోగించుకొనే అవకాశమున్నా అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించకపోవడంతో పలువురు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేశారు. శివాపురం పోలింగ్‌ కేం ద్రానికి చిన్న నాగప్ప అనే 85 ఏళ్ల వయసు ఉన్న వృద్ధుడు వచ్చి ఓటు వేశాడు.


ఓటు హక్కు వినియోగించుకొన్న నాయకులు

మడకశిరటౌన: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్‌ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు శింగనమల మండలం అలంకరా యణపేటలో ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మడకశిర జూనియర్‌ కళాశా లలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న అమరాపురం మండల కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేసుఽధాకర్‌ గుడిబండ మండలం కరికెర గ్రామంలో, ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి మడకశిర జూనియర్‌ కళాశాలలో ఓటు వేశారు. ఇదిలా ఉండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి సైకిల్‌ తొక్కుతూ పట్టణంలో పట్టణంలోని పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించారు. పోలింగ్‌ సరళిపై అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వారి వెంట రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ, నాయకులు తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 14 , 2024 | 01:27 AM