Share News

VOTE : మడకశిరలో 87.5 శాతం పోలింగ్‌

ABN , Publish Date - May 16 , 2024 | 12:06 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. ఫలితాలు తెలుసుకోవడానికి 20 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పోటీచేసిన అభ్య ర్థులతో పాటు రాజకీయ నాయకులు, కార్య కర్తలు, ప్రజలు ఫలితాలపై అంచనాలు మొ దలు పెట్టారు. ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థుల భవిత్యం ఈవీఎం బాక్స్‌లలో నిక్షిప్తం అయింది. మొత్తంగా ప్రధాన పార్టీలైనే టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ నెలకొంది.

VOTE : మడకశిరలో 87.5 శాతం పోలింగ్‌

పెరిగిన ఓటింగ్‌

బూతలవారీగా ఓట్ల లెక్కలపై ప్రధాన పార్టీల ఆరా

మడకశిర, మే15: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. ఫలితాలు తెలుసుకోవడానికి 20 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పోటీచేసిన అభ్య ర్థులతో పాటు రాజకీయ నాయకులు, కార్య కర్తలు, ప్రజలు ఫలితాలపై అంచనాలు మొ దలు పెట్టారు. ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థుల భవిత్యం ఈవీఎం బాక్స్‌లలో నిక్షిప్తం అయింది. మొత్తంగా ప్రధాన పార్టీలైనే టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అనుచరులతోను, తమ పార్టీ నాయకులతో పోలింగ్‌ స రళిపై ఆరా తీస్తున్నారు. గతంలో కంటే ఈ సారి పోలింగ్‌ శాతం బాగా పెరిగింది. దీంతో ఎవరికి లాభం అనే దానిపై చర్చసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల లెక్కలను సేకరించే పనిలో ప్రధాన పార్టీల నాయకులు నిమగ్నమ య్యారు. నియోజకవర్గంలో 87.5శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,10,804 మంది ఓటర్లు ఉండగా 1,84,524 మంది ఓటు హాక్కును వినియోగించుకున్నారు. పురషులు 1,05,760 మందికి గాను 93,487 మంది, మహిళలు 1,05,043 మందికి గాను 91,037 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.


విజయంపై ఎవరి ధీమా వారిదే..

మడకశిరటౌన: నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో విజయంపై ఇరుపార్టీల జ్ఛజుజీ తమదే గెలుపు అంటే తమదే గెలుపు అంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఈ సారి అత్యధికంగా 87.5 శాతం పోలిం గ్‌ నమోదు కావడం ప్రతి పక్షానికి అనుకూలిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికార పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అంటున్నారు. టీడీపీ విజయం తథ్య మని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. నియోజకవర్గంలో పురుషులు అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం, యువత తరలివచ్చి ఓటు వేయడంతో టీడీపీకి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మహిళలు, వృద్ధులు తమకే ఎక్కువగా ఓట్లు వేశారని, అది తమకు కలిసి వస్తుందని వైసీపీ వారు అంచనా వేస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యనే పోరు నెలకొంది. జూన 4వతేదీ జరిగే లెక్కింపులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 16 , 2024 | 12:06 AM