crime నీటికొలనులో పడి చిన్నారి మృతి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:56 AM
దైవదర్శనం కోసం వెళ్లిన ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఆ కుటుంబంలోని చిన్నారిని నీటికొలను బలి తీసుకుం ది. మండలంలోని శనగలగూడూరు గ్రా మానికి చెందిన హరికుమార్ రెడ్డి, భార్య జ్యోతి, కుమారులు చక్రధర్ రెడ్డి (9), విఘ్నేశ్వరరెడ్డితో కలిసి సోమవారం ఉదయం నంద్యాల జిల్లా మహానందికి దైవదర్శనం కోసం వెళ్లారు.
మహానంది దైవదర్శనానికి వెళ్లి మృత్యువాత
పుట్లూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దైవదర్శనం కోసం వెళ్లిన ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఆ కుటుంబంలోని చిన్నారిని నీటికొలను బలి తీసుకుం ది. మండలంలోని శనగలగూడూరు గ్రా మానికి చెందిన హరికుమార్ రెడ్డి, భార్య జ్యోతి, కుమారులు చక్రధర్ రెడ్డి (9), విఘ్నేశ్వరరెడ్డితో కలిసి సోమవారం ఉదయం నంద్యాల జిల్లా మహానందికి దైవదర్శనం కోసం వెళ్లారు.
అక్కడి కొలనులో చిన్నారులిద్దరికీ వాళ్ల అమ్మ స్నానం చేయించి పక్కన కూర్చోబెట్టింది. అయితే చక్రధర్‌రెడ్డి ప్రమాదవశాత్తూ కొలనులో పడ్డాడు. సమయానికి వాళ్ల నాన్న అక్కడ లేడు. స్థానికులు గమనించి బయటకు తీసేసరికే చిన్నారి అధికంగా నీళ్లు తాగడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మృతదేహాన్ని రాత్రి స్వగ్రామానికి తరలించారు. ఆ చిన్నారి తాడిపత్రిలోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అతని మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మరిన్ని అనంతపురం వార్తలు..