MINISTER KESAV : మంత్రికి వినతుల వెల్లువ
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:04 AM
మండలంలోని నింబగల్లు సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కు వినతులు వెల్లువెత్తాయి. తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ స్కీంలో పని చేస్తున్న వర్కర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో దళితులు వివాహాలు చేసుకునేందుకు సరైన సౌక ర్యాలు లేవని, అందుకు కల్యాణమండపం కోసం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రిని కోరారు.
ఉరవకొండ, జూలై29: మండలంలోని నింబగల్లు సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కు వినతులు వెల్లువెత్తాయి. తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ స్కీంలో పని చేస్తున్న వర్కర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో దళితులు వివాహాలు చేసుకునేందుకు సరైన సౌక ర్యాలు లేవని, అందుకు కల్యాణమండపం కోసం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రిని కోరారు. ఎస్సీ హాస్టల్ స్థలవివాదంపై ఆరేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా షరిష్కారం కాలేదని హాస్టల్ కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హంద్రీనీవా కాలువ లో పూడికతీయాలని, ముళ్ల పొదలు తొలగించాలని చాబాల, గడే హోతూరు రైతులు మంత్రికి విన్నవించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....