Home » Minister Payyavula Keshav
మండలంలోని నింబగల్లు సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కు వినతులు వెల్లువెత్తాయి. తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ స్కీంలో పని చేస్తున్న వర్కర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో దళితులు వివాహాలు చేసుకునేందుకు సరైన సౌక ర్యాలు లేవని, అందుకు కల్యాణమండపం కోసం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రిని కోరారు.
ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..