YCP : పట్టుకుంటున్న భూతం
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:20 PM
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...
వైసీపీ పాలనలో యథేచ్ఛగా భూ అక్రమాలు
22-ఏ, చుక్కల భూముల్లో అక్రమాలు
సమగ్ర వివరాలివ్వాలని సీసీఎల్‌ఏ ఆదేశం
రెవెన్యూ అక్రమార్కుల్లో మొదలైన వణుకు
కళ్యాణదుర్గం: గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాలు రాయించుకున్నారనే ఆరోపణులు ఉన్నాయి. ఇలా ఇళ్ల పట్టాలను అక్రమమార్గం లో కొట్టేసి, వాటిని విక్రయించి వాటాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు మండలాల్లో 22ఏ
జాబితాలో ఉన్న భూములపై కన్నేసిన వైసీపీ నాయకులు మంత్రి ఉష శ్రీచరణ్ అండదండలతో అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన చేయించారన్న విమర్శలు కూడా వినిపించాయి. అడిగినంత డబ్బు ఇస్తే ఎటు వంటి ఆధారాలు లేకున్నా వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించారు. కొందరు నేతలు సెటిల్‌మెంట్ భూములను 22ఏలోకి చేర్పించి భూ యజ మానులను ము ప్పతిప్పలు పెట్టి ముక్కుపిండి వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చుక్కల భూముల సమస్యలు పరిష్కరించేందుకు భారీగా నగదు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
గత ఐదేళ్ల వివరాల సేకరణ
సీసీఎల్‌ఏ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ర్టేషన) అధికారులు ప్రధానంగా 22ఏ, చుక్కల భూముల నుంచి ఎన్ని ఎకరాలు తొలగించారు. ప్రభుత్వ, డీకేటీ భూముల్లో ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. ఫ్రీహోల్డ్‌గా ఎంత చేశారు. మాజీ సైనికులకు ఎంత భూమి ఇచ్చారన్న వివరాలపై ప్రభుత్వం ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. వీటితో పాటు వ్యవసాయేతర భూమిగా ఎంత మార్చారనేది ప్రతి మండలం నుంచి నివేదిక కోరుతున్నట్లు తెలిసింది. ఇలా 2019 నుంచి 2024 జూలై 23 వరకు ఉన్న వివరాలు సమగ్రంగా సమర్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిలో జగనన్న కాలనీలకు ఎంత ఇచ్చారు. ఇతర అవసరాలకు ఎంత కేటాయించారో కూడా స్పష్టం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం కోరుతున్నట్లు తెలిసింది. చుక్కల భూమి వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే చుక్కల భూముల వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
అప్పటి మంత్రి దందా బయటకు...
నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్ చుక్కల భూముల వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకోసం తాను చెప్పినదానికి అనుగుణంగా పని చేసే తహసీల్దార్లను నియమించుకున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని వేల ఎకరాలను రిజిస్ట్రేషన చేయించి లక్షలాది రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చుక్కల భూముల దందాపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దీంతో గత ఐదేళ్ల భూదోపిడీ కూడా బహిర్గతమయ్యే అవకాశం వుంది.
డబ్బులిస్తే చాలు..
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. చుక్కల భూములను కూడా దర్జాగా డబ్బు లు తీసుకుని రిజిస్ట్రేషన చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. వైసీపీ హయాం లో అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్ కనుసన్నల్లో సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయమంతా పనిచేసింది. ఆ ఐదేళ్ల కాలంలో పనిచేసిన ఒక సబ్ రిజిసా్ట్రర్ మంత్రి ఉష శ్రీచరణ్‌కు తొత్తుగా మారి ఆమె చెప్పిందే వేదంగా భావించి చుక్కల భూములు కూడా రిజిస్ట్రేషన చేయించారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రతి రోజు సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని వాటాలు పంచుకున్నట్లు తెలిసింది. వీటన్నింటిపై కూటమి ప్రభుత్వం లోతుగా వివరాలు సేకరిస్తుండటంతో సూత్రధారులు, పాత్రధారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....