Home » Districts
అప్పులు తెచ్చి, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన ఉద్యాన పంటలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. వైర్‌సల దెబ్బకు నిలువునా ఎండిపోతున్నాయి. పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడులు, ఆరుగాలం కష్టం వృథా అవుతున్నాయి. లక్షల రూపాయల నష్టాలు మూటగట్టుకుంటున్నారు రైతులు. వైర్‌సల దెబ్బకు ఉద్యాన పంటలైన కలింగర, కర్బూజా, ఢిల్లీ దోస ...
నెల మామూళ్లు ఇస్తే చాలు.. బియ్యాన్ని అక్రమంగా తరలించుకోవచ్చు. మద్యం దుకాణదారులు నిబంధనలను గాలికి వదిలేయొచ్చు. పేకాట స్థావరాలు పెట్టుకుని.. ఎన్ని ముక్కలాటలైనా ఆడుకోవచ్చు. దొంగతనాలు, ఆత్మహత్యలు, గొడవలు.. ఇలా ఏ నేరం జరిగినా పంచాయితీ పెడతారు. కేసు కట్టకుండా సెటిల్మెంట్ చేసి పంపుతారు. కాసులు రాలవని తెలిస్తే.. ఆ కేసుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఛేదించని దొంగతనం కేసులూ ఈ ...
జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరం శుక్రవారం ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందడోలికల్లో మునిగితేలారు. అనంతపురం నగరంతోపాటు... బంజారాలు అధికంగా ఉండే తండాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో కాముడి దహనం కార్యక్రమాలు చేశారు. ఇస్కాన మందిరంలోనూ ...
ఆపద సమయాలలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌ను ఆదేశించారు. ప్రతి మహిళ తమ ఫోనలో శక్తి యాప్‌ను డౌనలోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ యాప్ ద్వారా హింసాత్మక ...
పట్టణంలోని ధర్మవరం గేట్ సమీపంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన విదేశీ పక్షి కోకాటైల్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే పీట్ జోన దుకాణంలో విదేశీ పక్షిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారి అదేశాల ...
పట్టణం అంటేనే గుర్తొచ్చేవి ఇరుకు రోడ్లు, వాటిపైనే మురుగు ప్రవాహాలు, దుర్గంధం, ఎటుచూసినా చెత్తాచెదారం. పట్టణ ప్రజలు నిత్య నరకం అనుభవించేవారు. దశాబ్దాలుగా పట్టణ సమస్యలు అలానే ఉండేవి. గత వైసీపీ హయాంలో ఒకట్రెండు పనులు హడావుడిగా చేపట్టారు, అర్ధంతరంగా ఆపేశారు. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కూటమి అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎటుచూసినా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్లపై మురుగు ..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న మోసగాళ్ల ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పింఛన్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమపార్టీ వారని అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో డాక్టర్లు ధ్రువపత్రాలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొందరు దళారీలు డాక్టర్లను బుట్టలోకి వేసుకొని డబ్బులిచ్చి నకిలీ వైకల్య ధ్రువపత్రాలను ...
భూవివాదంతో రాయలచెరువులో బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయలచెరువులో సర్వే నంబరు 650/బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌లోని 1.25 ఎకరాల స్థలంపై వివాదం నెలకొంది. రాయలచెరువుకు చెందిన మాదాల భాస్కర్ తల్లి పేరుతో భూమి ఉన్నట్లు రాయలచెరువు వాసులు చెబుతున్నారు. ఈ భూమిని వేరొక వ్యక్తితో తాము కొన్నామంటూ పులివెందులకు చెందిన ఒక ప్రముఖ నాయకుడి పేరు చెప్పి కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. వివాద స్థలం వద్దకు బుధవారం సాయంత్రం వచ్చిన బయట వ్యక్తులు, రాయలచెరువు గ్రామానికి చెందిన వ్యక్తులు గొడవపడ్డారు. పరిస్థితి ఒకరిపై ఒకరు దాడిచేసుకొనే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ...
జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతలో ఏడు వేల కేసులను రాజీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్ అన్నారు. తన చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. చివరి జాతీయ లోక్‌అదాలతలో 6వేలకు పైగా కేసులు పరిష్కారమ ...
వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో ...