Share News

CRIME : చిదిమేసి చేతిలో పెట్టారు..!

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:57 PM

అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి ఏడాది..! ఇంటిల్లిపాదీ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. ‘బెంగళూరుకో, కర్నూలుకో పోతాం.. రాసివ్వండి సార్‌..’ అని డాక్టర్‌ను అడిగితే.. ‘అంతా మీ ఇష్టమేనా..? ఇక్కడే బాగవుతుందిలే..’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఏమీ అనలేకపోయారు. ఇంకో రెండు రోజులు గడిచాక.. పరిస్థితి విషమించింది. ‘అంబులెన్స మాట్లాడుతా..! అందులో ఆక్సిజన ఉంటుంది. పెట్టుకోని వెంటనే ...

CRIME : చిదిమేసి చేతిలో పెట్టారు..!
Imtiaz (File)

పసివాడి ప్రాణం తీసిన ప్రైవేటు వైద్యం

పదిరోజులపాటు జ్వరానికి ఉత్తుత్తి వైద్యం

కర్నూలుకు తరలిస్తుండగా అంబులెన్సలో ఆక్సిజన ఖాళీ

బయటికి చెబితే అంతు చూస్తామని తల్లిదండ్రులకు బెదిరింపు

గుంతకల్లులో దారుణం..

ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళన

అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి ఏడాది..! ఇంటిల్లిపాదీ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. ‘బెంగళూరుకో, కర్నూలుకో పోతాం.. రాసివ్వండి సార్‌..’ అని డాక్టర్‌ను అడిగితే.. ‘అంతా మీ ఇష్టమేనా..? ఇక్కడే బాగవుతుందిలే..’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఏమీ అనలేకపోయారు. ఇంకో రెండు రోజులు గడిచాక.. పరిస్థితి విషమించింది. ‘అంబులెన్స మాట్లాడుతా..! అందులో ఆక్సిజన ఉంటుంది. పెట్టుకోని వెంటనే కర్నూలుకు వెళ్లండి..’ అని డాక్టరుగారు చావు కబురు చల్లగా చెప్పారు. ఆయన చెప్పిన అంబులెన్సులో హడావుడిగా బయలుదేరారు. సగం దూరం కూడా వెళ్లలేదు..! అంబులెన్సలో ఆక్సిజన అయిపోయింది. బిడ్డలో కదలికలు లేవు..! ఒకప్పుడు వైద్యులను సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడితో పోల్చేవారు. ఇప్పుడు


యమధర్మరాజు కూడా వైద్యుడి అవతారం ఎత్తాడు అనుకోవాలా..? బిడ్డపోయిన బాధలో తల్లిదండ్రులు ఉంటే.. ‘ఆక్సిజన అయిపోయినందుకే బిడ్డ చనిపోయినట్లు గొడవ చేశారో..’ అని అంబులెన్స నిర్వాహకుడు బెదిరించాడట..! యమకింకరుడికి ఏమాత్రం తీసిపోకుండా..! ఇంత జరిగితే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని, ఇంకోసారి ఇలా జరకుండా చూడాలని కోరాల్సిన నాయకులు కొందరు.. ఆస్పత్రి వద్దకు వెళ్లి సెటిల్మెంట్‌ చేశారు. ఆ దుప్పటి పంచాయితీకి ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

- గుంతకలు ్లటౌన

గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన షఫి, జాస్మీన దంపతుల కుమారుడు ఇంతియాజ్‌కు పది రోజుల క్రితం జ్వరం వచ్చింది. పట్టణంలోని ఆర్టీ గుప్త హాస్పిటల్‌లో ఆడ్మిట్‌ చేశారు. జ్వరం తగ్గకపోవడంతో రెఫర్‌ చేస్తే బెంగళూరు లేదా కర్నూలుకు తీసుకువెళతామని వైద్యుడు కీర్తి కిరణ్‌ రెడ్డిని అడిగారు. ‘నేను రెఫర్‌ చేస్తేనే వెళ్లాలి. అంతా మీ ఇష్టమేనా.. ఇక్కడే తగ్గిపోతుందిలే..’ అని ఆయన అన్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున బాలుడి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే కర్నూలుకు తీసుకెళ్లాలని డాక్టర్‌ కీర్తి కిరణ్‌ సూచించారు. ‘నేను అంబులెన్స రెడీ చేస్తాను. అందులో ఆక్సిజన ఉంటుంది. ఆక్సిజన పెట్టుకుని కర్నూలుకు తీసుకెళ్లండి’ అని సూచించారు. అంబులెన్సలో బాలుడిని తీసుకుని ఉదయం 6 గంటలకు కర్నూలుకు బయలుదేరారు. ప్యాపిలి మండల కేంద్రం వద్దకు వెళ్లేలోగా అంబులెన్సలో ఆక్సిజన అయిపోయింది. దీంతో ఊపిరి అందక బాలుడిలో కదలికలు స్తంభించాయి. డోన పట్టణానికి చేరుకుని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఆక్సిజన అందకనందుకే తమ కుమారుడు మృతిచెందాడని అక్కడి వైద్యాధికారులు నిర్ధారించి, సర్టిపికెట్‌ ఇచ్చారని బాలుడి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకుని గుంతకల్లులోని ఆర్టీ గుప్త ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా సరైన వైద్యం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాక్టర్‌, అంబులెన్స నిర్వాహకుడి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని ఆరోపించారు. సుమారు నాలుగు గంటలపాటు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణారెడ్డి, గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, మైనార్టీ నాయకులు, కులసంఘాల నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వైద్యుడితో మాట్లాడారు. బాలుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని డాక్టర్‌ చెప్పడంతో ఆందోళన విరమించారు. వివాదంపై డాక్టర్‌ స్పందించలేదు.

అంబులెన్స ఓనర్‌ బెదిరింపులు

మృతిచెందిన బాలుడిని అంబులెన్సలో గుంతకల్లుకు తిరిగి తీసుకొస్తున్న సమయంలో అంబులెన్స ఓనర్‌ సలీం తమను బెదిరించాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ‘ఆసుపత్రి వద్దకు వెళ్లి గొడవ చేస్తే మీ సంగతి చూస్తా’ అని హెచ్చరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్దకు రాగానే బాలుడి మృతదేహాన్ని కిందకు దించి, అంబులెన్స అద్దాలను పగులగొట్టారు. అంబులెన్సు నిర్వాహకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారని సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. డాక్టర్‌ను నిలదీసేందుకు వెళుతున్న బాలుడి బంధువులను అడ్డుకున్నారు. ‘ఇంత మంది విలేకరులు ఎందుకు వచ్చారు? డాక్టర్‌తో మీరేం మాట్లాడుతారు?’ అని విలేకరుపట్లా దురుసుగా వ్యవహరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 11:57 PM