Share News

మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:50 PM

హిందూపురం డిపోకు చెందిన రొద్దం వెళ్లే ఆర్టీసీ బస్సు మార్గ మ ధ్యలో మొరాయించ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు.

మొరాయించిన ఆర్టీసీ బస్సు
రొద్దం వద్ద ఆగిపోయిన ఆర్టీసీ బస్సు

రొద్దం, జనవరి 14 : హిందూపురం డిపోకు చెందిన రొద్దం వెళ్లే ఆర్టీసీ బస్సు మార్గ మ ధ్యలో మొరాయించ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. హిందూపురం నుం చి ఏపీ29 జెడ్‌2430 నం బరు బస్సు ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో రొద్దం వ చ్చింది. తిరుగు ప్రయా ణంలో కందుకూర్లపల్లికి వెళ్లేదారిలో ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు హిందూపురానికి వె ళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. హిందూపురం నుంచి మెకానిక్‌ వచ్చేవరకు కండెక్టర్‌, డ్రైవర్‌, కొంతమంది ప్రయాణికులు అక్కడే వేచి ఉన్నారు. సాయంత్రం మరమ్మతుల అనంతరం హిందూపురానికి బయలుదే రింది. కాలం చెల్లిన బస్సులు తరచూ మరమ్మతులకు వస్తున్నాయని ప్రయాణికులు వాపోయారు.

Updated Date - Jan 14 , 2024 | 11:50 PM