Share News

పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:58 PM

కేంద్రంలో మోడీ ప్రభుత్వం పంటలకు కనీసం మద్దతుధర చట్టం చేయాలని సీ ఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేం ద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి
నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ, ఐక్య రైతుసంఘాల నాయకులు

అనంతపురం కల్చరల్‌, మార్చి 14 : కేంద్రంలో మోడీ ప్రభుత్వం పంటలకు కనీసం మద్దతుధర చట్టం చేయాలని సీ ఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేం ద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. గురు వారం కార్మిక, రైతు, కౌలురైతు, వ్యవ సాయ కార్మిక, రైతుకూలీ సంఘాల సం యుక్త ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ... మోడీ ఇచ్చిన హామీ, స్వా మినాథన సిఫారసుల మేరకు పంటలకు మద్దతుధర చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి, రోజుకు వేతనం రూ.600 చెల్లించాలని, పట్టణాలకు విస్తరిం పజేయాలని అన్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, పంటనష్ట పరిహారం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలో రైతుల పంట లకు రుణ ఉపశమన చట్టం చేయాలని, రైతాంగ ఉద్యమం సంద ర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల అన్నింటి పరిష్కారంకోసం ఈనెల 14న సంయుక్త కిసాన మోర్చ ఆధ్వర్యంలో చేపట్టే చలో ఢిల్లీ కార్య క్రమంలో అన్నివర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నప్పయాదవ్‌, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరంగయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఏపీ రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కిష్టా, రాయుడు, సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 11:58 PM