Share News

SAVITA : మంత్రి సవితకు ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:50 PM

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీ కరించిన అనంతరం మొట్టమొదటగా జిల్లాకు వచ్చిన మంత్రి సవితమ్మకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం అపూర్వ స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పెనుకొండకు వస్తున్న ఆమెకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లు కుంట అంజినప్పతోపాటు టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు బాగేపల్లి టోల్‌ ఫ్లాజా వద్ద బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు.

SAVITA : మంత్రి సవితకు ఘన స్వాగతం
To Minister Savita at Penukonda The TDP leaders are welcoming with gajams

చిలమత్తూరు, జూన 23: రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీ కరించిన అనంతరం మొట్టమొదటగా జిల్లాకు వచ్చిన మంత్రి సవితమ్మకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం అపూర్వ స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పెనుకొండకు వస్తున్న ఆమెకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లు కుంట అంజినప్పతోపాటు టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు బాగేపల్లి టోల్‌ ఫ్లాజా వద్ద బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను పూల మాల లతో సత్కరించారు. కార్యకర్తలు ఆమెతో కరచాలనం చేశారు. అలాగే కొడికొండ చెక్‌పోస్టు వద్ద అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కోడూరు తోపు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజమాలతో స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా ఆమె సంతోష వ్యక్తం చేస్తూ ప్రతిఒక్కరిని అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా టీడీపీ జిందాబాద్‌, జై చంద్రబాబు, జై లోకేష్‌, జై బాలయ్య, మంత్రి సవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

గోరంట్ల: గోరంట్లలోని పార్టీ కార్యాల యం నుంచి మండలకన్వీనర్‌ సోమశేఖర్‌ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల్లో తరలి వెళ్లి బాగేపల్లి టోల్‌ఫ్లాజా వద్ద ఘనంగా స్వా గతం పలికారు. అలాగే పార్టీ నాయకులు దేవా నరసింహప్ప, అశ్వత్థరెడ్డి, బెల్లాల చెరువు చంద్ర, మనోహర్‌, నరేంద్రరాయల్‌, అజం తుల్లా, గిరిధర్‌గౌడ్‌, గంగాధర్‌ రెడ్డి, బాలక్రిష్ణ, నరేష్‌, ఉత్తమరెడ్డి, అశోక్‌, హరి చౌదరి తదితరులు బెంగళూరు విమానాశ్రయనికి వెళ్లి మంత్రికి పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతించారు. బీజేపీ మండలా ధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, జనసేన జిల్లాకార్యదర్శి సు రేష్‌, మండలకన్వీనర్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. గోర ంట్ల మండలంలోని రెడ్డిచెరువుపల్లి, పాలసముద్రం, జాతీయ రహదారి కూడలిలో గజమాలతో స్వాగతం పలికారు.


వార్డు మాజీ సభ్యుడు నాగరాజు ఏర్పాటు చేసిన పండ్ల మొక్కను పాలసముద్రం కూడలిలో మంత్రి నాటారు. నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ కట్‌ చేశారు.


పాలసముద్రం నాయకుడు అంబేడ్కర్‌ చిత్రపటాన్ని మంత్రికి బహూకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులున్నారు.

పెనుకొండ రూరల్‌: మంత్రి సవితకు స్వాగతం పలికేందుకు టీడీపీ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు పెనుకొండలో పెద్దఎ త్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్‌ నుంచి మడకశిర రహదా రిలో ఉన్న టీడీపీ కార్యాలయం వరకు రోడ్డుకు ఇరు వైపులా మంత్రి సవిత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన, బీజేపీ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హిందూపురం అర్బన: మంత్రి సవితకు పరిగి మండల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సవిత అభిమానులు భారీ సంఖ్యలో బాగేపల్లి టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్నారు. కొందరు కొడికొండ చెక్‌పోస్టులో ఉన్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పరిగి మండల నాయకులు ప్రవీణ్‌ రెడ్డి, విష్ణు, వెంకటేష్‌, ఆదినారాయణ, రామాంజనేయులు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2024 | 11:50 PM