DHARNA ; నేహ హత్యను ఖండిస్తూ ఏబీవీపీ ధర్నా
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:12 AM
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి పట్టణంలోని ఎమ్మెస్సీ విద్యార్థిని నేహ హీరేమఠ హత్యను ఖండిస్తూ పావగడలోని ఏబీవీపీ వైద్యకీయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. హుబ్బళ్లి నగరంలోని బీబీవీ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతున్న నేహహీరేమఠను ఫయాజ్ అనే వ్యక్తి తొమ్మిదిసార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన క్షమించరానిదని ప్రముఖ వైద్యుడు వివేకానంద విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్ జి వెంకటరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
పావగడ, ఏప్రిల్ 23: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి పట్టణంలోని ఎమ్మెస్సీ విద్యార్థిని నేహ హీరేమఠ హత్యను ఖండిస్తూ పావగడలోని ఏబీవీపీ వైద్యకీయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. హుబ్బళ్లి నగరంలోని బీబీవీ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతున్న నేహహీరేమఠను ఫయాజ్ అనే వ్యక్తి తొమ్మిదిసార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన క్షమించరానిదని ప్రముఖ వైద్యుడు వివేకానంద విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్ జి వెంకటరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఉన్మాదానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించినప్పుడే నేహ హీరేమఠ ఆత్మకు శాంతి కలుగు తుందని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. పెద్దఎత్తున నినాదాలు చేపట్టారు. బాధ్యుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్ శశికిరణ్, రవిశంకర్‌నాయక్, అశోక్, రామాంజనేయ, విద్యార్థులతో కలిసి గ్రేడ్-2 తహసీల్దార్ నరసింహమూర్తికి వినతిపత్రం అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....