Home » Protest
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.
ఇవాళ మళ్లీ పంజాబ్ రైతుల బృందం తమ డిమాండ్లతో ఢిల్లీకి పాదయాత్ర చేస్తోంది. ఈ క్రమంలో రైతులను ఢిల్లీ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ-హర్యానా శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో రైతుల నిరసన నేపథ్యంలో పోలీసులు నిఘాను కఠినతరం చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రైతులు పెద్ద ఎత్తున మహామాయ ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకోవడంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
రైతులు మరోసారి ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు (డిసెంబర్ 2న) దాదాపు 10 రైతు సంఘాలు ఢిల్లీలో అడుగుపెట్టనున్నాయి. పార్లమెంట్‌ను ముట్టడిస్తామని రైతులు ప్రకటించారు. ఇదే సమయంలో వీరిని ఆపడానికి పోలీసులు పూర్తి సన్నాహాలు చేశారు.
కోల్‌కతాలోని మానిక్తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.