Share News

soil digging మట్టి దందా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:52 AM

మండలంలో మట్టి దందాకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.

 soil digging   మట్టి దందా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

యాడికి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలో మట్టి దందాకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గండికోట లక్ష్మణ్‌, పార్టీ మండల కన్వీనర్‌ రుద్రమనాయు డు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడుతూ.. యాడికి మండలంలో ప్రభుత్వ భూము లు, దేవాదాయ భూముల్లో వైసీపీ నాయకుడు బొంబాయి రమే్‌షనాయుడు మట్టిని పెద్దఎత్తున అక్రమంగా తరలించారని తెలిపారు. చిన్నపేట ఆంజనేయస్వామి మాన్యంలో సర్వేనెంబరు 753-1లో మట్టిని పెద్దఎత్తున అక్రమంగా తరలించారని, దీనివల్ల అక్కడ విద్యుత సరఫరా చేసే హైటెన్షన టవర్‌ కూలడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని యాడికిలో అనధికారిక లేఔట్లలోకి గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. బొంబాయి రమే్‌షనాయుడు, అతని అనుచరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని వారు కోరారు.


మరిన్ని అనంతపురం వార్తలు..

Updated Date - Nov 12 , 2024 | 12:59 AM