DSP : కల్తీ కల్లు అమ్మితే చర్యలు: డీఎస్పీ
ABN , Publish Date - May 23 , 2024 | 11:52 PM
కల్తీ కల్లు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పెనుకొండ డీఎస్పీ బాజీజాన సైదా హెచ్చరించారు. మడకశిర నియోజకవర్గంలో కల్లుగీత యజమానులు, కార్మికులతో ఆయన గురువారం మడకశిర సర్కిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... రసాయనాలు కలిపి కల్తీ కల్లు విక్రయించే వారిపై పీడీ యాక్ట్, అబ్కారీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు.
మడకశిర టౌన, మే 23: కల్తీ కల్లు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పెనుకొండ డీఎస్పీ బాజీజాన సైదా హెచ్చరించారు. మడకశిర నియోజకవర్గంలో కల్లుగీత యజమానులు, కార్మికులతో ఆయన గురువారం మడకశిర సర్కిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... రసాయనాలు కలిపి కల్తీ కల్లు విక్రయించే వారిపై పీడీ యాక్ట్, అబ్కారీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. నియోజకవర్గంలోని కల్లు విక్రయించేఅన్ని దుకాణాలను తనిఖీ చేసి ప్రతి నెల నివేదిక పంపాలని సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. అనంతరం కల్లు నిర్వహణకు సంబంధించిన లైసెన్సలను తనఖీ చేసి కల్లు యజమానులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐలు మనోహర్, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....