Share News

NARASIHMA SWAMY : ఖాద్రీశుడిని దర్శించుకున్న ఏడీజే

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:58 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో వెలసిన నరసింహ స్వామిని జిల్లా అడిషన కోర్టు న్యాయాధికారి సత్యవాణి శనివారం దర్శించు కున్నారు. ఏడీజే వెంట స్థానిక న్యాయాధికారులు ఎస్‌ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి ఇతర సిబ్బంది ఆలయానికి వచ్చారు. వారికి తూర్పు రాజగోపురం వ ద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం న్యాయాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్టత వివరించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

NARASIHMA SWAMY : ఖాద్రీశుడిని దర్శించుకున్న ఏడీజే
Temple officials and priests presenting the picture of Qadrishu to ADJ

కదిరి లీగల్‌, జూలై 27: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో వెలసిన నరసింహ స్వామిని జిల్లా అడిషన కోర్టు న్యాయాధికారి సత్యవాణి శనివారం దర్శించు కున్నారు. ఏడీజే వెంట స్థానిక న్యాయాధికారులు ఎస్‌ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి ఇతర సిబ్బంది ఆలయానికి వచ్చారు. వారికి తూర్పు రాజగోపురం వ ద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం న్యాయాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్టత వివరించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.


అనంతరం వారు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన వైదేహీ ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏడీజేను స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి సన్మానించారు. స్థానిక కోర్టుల తనిఖీల్లో భాగంగా కదిరికి వచ్చినట్లు ఏడీజే పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కను నాటారు.

ఆంజనేయస్వామిని దర్శించుకున్న న్యాయాధికారులు

నల్లచెరువు, జూలై 27: ప్రసిద్ధి చెందిన మండలపరిధిలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని శనివారం జిల్లా మొదటి అడిషనల్‌ కోర్టు న్యాయాధికారి సత్యవాణి, కదిరి సివిల్‌ కోర్టు న్యాయాధికారి ప్రతిమ, అడిషనల్‌ సీనియర్‌ సి విల్‌ కోర్టు న్యాయాధికారి మీనాక్షి సుందర్‌ దర్శించుకున్నారు. న్యాయాధికారు ల కు ఆలయ ఈఓ రవీంద్రరాజు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు. దుశ్శాలువలతో సత్కరించి, ఆంజనేయస్వామి చిత్రపటాలను బహూకరించారు. ఆలయ విశిష్టతను వివరించారు. న్యాయాధికారులతో పాటు పలువురు న్యాయవాదులున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 28 , 2024 | 12:58 AM