Share News

Police: శాంతియుత ఎన్నికలే లక్ష్యం: డీఎస్పీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:34 AM

గొడవలు, అల్లర్లులేని శాంతియుత ఎన్నికలే తమ లక్ష్యమని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం శెట్టూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శెట్టూరు, చిన్నంపల్లి, లక్ష్మంపల్లి, చింతర్లపల్లి, పెరుగుపాల్యం, ములకలేడు తదితర గ్రామాలలో ఫ్లాగ్‌మార్చ్‌ చేసి కవాతు నిర్వహించారు.

Police: శాంతియుత ఎన్నికలే లక్ష్యం: డీఎస్పీ
శెట్టూరులో ప్రజలకు సూచనలిస్తున్న పోలీసులు

కళ్యాణదుర్గంరూరల్‌, ఏప్రిల్‌ 21: గొడవలు, అల్లర్లులేని శాంతియుత ఎన్నికలే తమ లక్ష్యమని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం శెట్టూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శెట్టూరు, చిన్నంపల్లి, లక్ష్మంపల్లి, చింతర్లపల్లి, పెరుగుపాల్యం, ములకలేడు తదితర గ్రామాలలో ఫ్లాగ్‌మార్చ్‌ చేసి కవాతు నిర్వహించారు. సీఐ ఎస్‌వీ నాగరాజు, ఎస్‌ఐ రాంభూపాల్‌, బీఎ్‌సఎఫ్‌ ఇన్సపెక్టర్‌ సుమిత కుమార్‌ శర్మ, సబ్‌ ఇన్సపెక్టర్లు మనోజ్‌ కుమార్‌, రాజస్‌ త్యాగి, కుల్దీప్‌ సింగ్‌ రాథోడ్‌, 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


గుంతకల్లుటౌన: పట్టణంలోని ఆంథోని కాలనీలో ఆదివారం సాయంత్రం డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫుట్‌మార్చ్‌ నిర్వహించారు. కాలనీ ప్రజలతో డీఎస్పీ సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలన్నారు. ఏమైౖనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. వనటౌన, టూటౌన సీఐలు రామసుబ్బయ్య, గణేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


యల్లనూరు: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అందుకు కావాల్సిన రక్షణ కల్పిస్తామని డీఎస్పీ శివారెడ్డి వెన్నపూసపల్లి ప్రజలకు తెలిపారు. ఆదివారం సాయంత్రం వెన్నపూసపల్లి, నిట్టూరు గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటుచేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పుట్లూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ గిరిబాబు ఉన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:34 AM