Share News

AP ELECTIONS : ఉద్యోగుల ఓటు ఎవరికో..?

ABN , Publish Date - May 27 , 2024 | 12:02 AM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ భారీగా జరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తానని, పాతపెన్షన విధానంను పునరుద్ధరిస్తానని, మెరుగైన పీఆర్‌సీ, పెండింగ్‌ లేకుండా డీఏలు చెల్లిస్తామని, ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయుడికి సొంత ఇల్లు కట్టించి ...

AP ELECTIONS : ఉద్యోగుల ఓటు ఎవరికో..?

భారీగా నమోదైన ఓటింగ్‌

తమకు వ్యతిరేక ఓటు అని వైసీపీలో ఆందోళన

ఈసీ ఆదేశాలతో

ఉద్యోగుల సమస్యలకు చెక్‌

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఫలితాలపై ఉత్కంఠ

అనంతపురం టౌన, మే 26: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ భారీగా జరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తానని, పాతపెన్షన విధానంను పునరుద్ధరిస్తానని, మెరుగైన పీఆర్‌సీ, పెండింగ్‌ లేకుండా డీఏలు చెల్లిస్తామని, ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయుడికి సొంత ఇల్లు కట్టించి ఇస్తామని, ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం నడుపుతామని ఇలా ఎన్నో హామీలను సీఎం జగన ఇచ్చాడు. అపుడు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు పెన్షనర్లు, వారికుటుంబ సభ్యులు జగనకు మద్దతుపలికారు. అయితే అదికారంలోకి వచ్చిన


తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను మరచిపోయి, పీఆర్‌సీలో రివర్స్‌ ఉత్తర్వులు ఇచ్చి ద్రోహం చేశారని ఆయా వర్గాలు మండిపడ్డాయి. ఇది అన్యాయమని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు అంటే వారిని నాలుగేళ్లుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. అన్నీ భరించిన ఆయా వర్గాలు ఎన్నికల్లో తమ సత్తా చూపించినట్లు సమాచారం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధాయ వర్గాలు 22546 మంది పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈసీ ఆదేశాలతో వైసీపీ డ్రామాకు చెక్‌

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఎలాగైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ శాతాన్ని తగ్గించాలని వైసీపీ నాయకులు వివిధ రకాలుగా కుట్రలు పన్నుతూ వచ్చారు. తమకు అనుకూలమైన ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకొని ఓటు నమోదుతో పాటు ఓటింగ్‌ పక్రియ సమయాలలో రోజుకో నిబంధనతో అనేక అడ్డంకులు సృష్టించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు కొన్ని ఉద్యోగ వర్గాలు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన దృష్టికి తీసికెళ్లారు. స్పందించిన ఈసీ అందరు ఓటు నమోదుకు, ఓటు వేయడానికి


గడువు పెంచి అవకాశం కల్పించింది. దీంతో ఎన్నికల విధులలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అందరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌ సమయంలో నిబంధనల మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం, సీల్‌ వేసి ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా కొందరు ఆర్‌ఓలు సంతకం పెట్టి సీల్‌ వేయకుండా ఓటు వేయించారు. మరికొన్ని చోట్ల సంతకం, సీల్‌ రెండులేకుండా ఓటు వేయించారు. అనంతపురం అర్బన, రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల నుంచి ఇలాంటి ఫిర్యాదులొచ్చాయి. కలెక్టరు సైతం గెజిటెడ్‌ సంతకం, సీల్‌ ఉంటేనే ఆపోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు చెల్లుతుందని తెలుపుతూ వచ్చారు. దీంతో చాలా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లకుండా పోతాయన్న ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ప్రతి పక్షాలు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన దృష్టికి తీసికెళ్లి అన్ని ఓట్లు చెల్లే విధంగా చూడాలని విన్నవించాయి. కేంద్ర ఎన్నికల కమిషన అన్ని ఓట్లు చెల్లే విధంగా చూడాలని స్పష్టత ఇస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెల్లుబాటు కావేమోనని టెన్షన పడుతున్న బ్యాలెట్‌ ఓటరుకు ఉపశమనం కలిగింది.


వైసీపీలో గుబులు

పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లపై ఎన్ని జిమ్మిక్కు లు వేసినా, చెల్లని ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన స్పష్టత ఇవ్వడంతో అధికార వైసీపీలో గుబులు మొదలైంది. ఈసారి పెద్దఎత్తున ఉద్యోగ వర్గాలు పోస్టల్‌ బ్యాలెట్‌కు నమోదు చేసుకొని గంటల తరబడి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది జగన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన ఓటేనని వైసీపీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే బ్యాలెట్‌పై సంతకంఉన్నా, సీల్‌ లేకపోయినా, గెజిటెడ్‌ అధికారి డిక్లరేషన లేకపోయినా, నిబంధనల మేరకు ఓటు వేసి ఉంటే చెల్లుతుందని ఈసీఐ చెప్పడంతో దాదాపు 95నుంచి 98శాతం వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెట్లుబాటు అ య్యే అవకాశాలున్నాయి. అనంతపురంఅర్బన, రాప్తాడు, గుంతకల్లు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాలలో ఈపోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు అధికారపార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నాయకులలో పోస్టల్‌ బ్యాలెట్‌ గుబులు రేపుతోంది. ఇంకో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలోను తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రభావం అధికార వైసీపీపై ఎంతమేర ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఆయా వర్గాలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.


20 టేబుళ్లు.. ఒక్కో టేబుల్‌కు 1128 ఓట్లు

అనంతపురం జిల్లాలో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 22,546 పోలయ్యాయి. ఇందులో రాయదుర్గం 1343, ఉరవకొండ 2043, గుంతకల్లు 2519, తాడిపత్రి 2101, శింగనమల 1598, అనంతపురం అర్బన 5759, కళ్యాణదుర్గం 2150, రాప్తాడు నియోజకవర్గంలో 3239 ఓట్లు పోలయ్యాయి. ఎనఆర్‌ఐలు, వివిధశాఖల అత్యవసరసేవల ఉద్యోగులు, హోంఓటింగ్‌, అంతర్‌ జిల్లాలకు చెందిన పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు మొత్తం కలిపి 1794 ఓట్లు పోలయ్యాయి. ఈఓట్లను జూన 4న జేఎనటీయూలో లెక్కించనున్నారు. ఇందుకోసం మొత్తం 20 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టేబుల్‌కు సరాసరిగా 1128 ఓట్లు లెక్కింపునకు తీసుకోనున్నారు. ఇలా ఎనిమిది నియోజకవర్గాలతో పాటు అనంతపురం పార్లమెంటుకు వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించనున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 27 , 2024 | 12:02 AM