Share News

CPI అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:37 AM

జిల్లాలోని అ న్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిం చాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.

 CPI అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

  • సీపీఐ డిమాండ్‌

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: జిల్లాలోని అ న్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిం చాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.


పలువురు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 31 మండలాలు కరువుతో అల్లాడుతున్నాయని, ఏడు మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించడం అన్యాయమని అన్నారు. తక్షణమే మిగిలిన మండలాలను కూడా కరువు కింద ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు, గుత్తి, యాడికి ,ఉరవకొండ, కణేకల్లు, బొమ్మనహాళ్‌ ,తాడిపత్రిలలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. కళ్యాణదుర్గంలో ఆర్డీఓకు అందించారు. పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల గ్రామసచివాలయం వద్ద నిరసన తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 05 , 2024 | 12:37 AM