Amitasha అమితషాను పదవి నుంచి తొలగించాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:16 AM
బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమితషాను పదవి నుంచి తొలగించాలని సీపీఐ, బీఎస్పీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
గుత్తి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమితషాను పదవి నుంచి తొలగించాలని సీపీఐ, బీఎస్పీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, బీఎస్పీ నాయకుడు గద్దల నాగభూషణం మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఒక మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన్ను అవమానించే విధంగా మాట్లాడిన అమితషాను తక్షణమే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు బాచి, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకుడు మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ నాయకుడు అడవిరాముడు, మాలసంఘం నాయకుడు చంద్ర, సీపీఐ నాయకులు నరసింహయ్య, రాజు, నజీర్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..