Share News

ఆగ్రహించిన వైద్యలోకం

ABN , Publish Date - Aug 18 , 2024 | 12:26 AM

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేయడంపై వైద్యసిబ్బంది ధ్వజమెత్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు ఏకమై భారీ ఆందోళనకు దిగారు. ఇండియన మెడికల్‌ అసోసియేషన పిలుపు మేరకు హిందూపురంలో ఐఎంఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఆగ్రహించిన వైద్యలోకం

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేయడంపై వైద్యసిబ్బంది ధ్వజమెత్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు ఏకమై భారీ ఆందోళనకు దిగారు. ఇండియన మెడికల్‌ అసోసియేషన పిలుపు మేరకు హిందూపురంలో ఐఎంఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. పరిగి వైద పీహెచపీ సిబ్బంది ర్యాలీ నిర్వహించి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. గోరంట్లలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫ్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 12:26 AM