Share News

దొంగ రిజిసే్ట్రషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?

ABN , Publish Date - May 02 , 2024 | 12:00 AM

భూములను నకిలీ ఆధార్‌ కార్డులతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయడంలో విశ్వేశ్వరరెడ్డికి ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. కూడేరు మండలం జయపురం, చోళసముద్రం, కూడేరు, కమ్మూరు, అరవకూరు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామాల్లో ప్రజలు గజమాలలతో, మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. కేశవ్‌ మాట్లాడుతూ వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు.

దొంగ రిజిసే్ట్రషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?
పయ్యావుల కేశవ్‌కు గజమాలతో స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు

అభివృద్ధి చేయలేని అసమర్థుడు విశ్వ

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

కూడేరు, మే 1: భూములను నకిలీ ఆధార్‌ కార్డులతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయడంలో విశ్వేశ్వరరెడ్డికి ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. కూడేరు మండలం జయపురం, చోళసముద్రం, కూడేరు, కమ్మూరు, అరవకూరు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామాల్లో ప్రజలు గజమాలలతో, మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. కేశవ్‌ మాట్లాడుతూ వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఉరవకొండ నియోజక వర్గంలో టీడీపీ హయాంలో జరిగిన పనులే తప్ప, విశ్వేశ్వరరెడ్డి ఏ అభివృద్ధి చేసిందిలేదన్నారు. ఖాళీ భూముల సర్వేనంబర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని, భూములను కాజేస్తున్నారని, ఈ ంతంతు కూడేరు మండలంలోనే జరిగిందన్నారు. టీడీపీ పాలనలో చోళసముద్రం, ఇప్పేరు, తదితర చెరువులకు నీరు అందిస్తే, వైసీపీ పాలనలో చెరువులకు నీరు ఇవ్వలేని అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డేనని మండిపడ్డారు.


కూడేరులో ఓబులయ్య కుంటకు నీరు తీసుకురావడానికి టీడీపీ హయాంలో సర్వేలు చేశామని, పార్టీ అధికారంలోకి రాగానే నీరు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో అరాచకం పెరిగిపోయిందని, అభివృద్ది ఏమాత్రం చేయలేదని, అలాంటి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసనమైయిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, విద్యార్థులకు, మహిళలకు, రైతుల సంక్షేమమే కూటమి ధ్యేయమన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని, వైసీపీకి ఓటమి తప్పదన్నారు. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, దళితులకు అందించే 27 పథకాలను పూర్తిగా రద్దు చేసిన ఘనత జగనరెడ్డికే దక్కిందన్నారు. కరెంటు రేట్లు, ఇసుక రేట్లు పెరిగిపోయాయని, టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక ఉచితంగా అందిస్తారన్నారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే డీఎస్సీపైనే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారన్నారు.


నవ్యాంధ్రప్రదేశగా తీర్చిదిద్దగలిగే సత్తా కూటమికే ఉంది

ఉరవకొండ: అప్పుల ఆంధ్రప్రదేశను నవ్యాంధ్రప్రదేశగా తీర్చిదిద్దాలంటే కూటమితోనే సాధ్యమని యువనాయకులు విక్రమ్‌ సిం హ, విజయ్‌సింహ అన్నారు. వజ్రకరూ రు మండలంలోని కొనకొండ్ల గ్రామం లో ఎమ్మెల్యే తనయులు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సూపర్‌సిక్స్‌ పథకాల వల్ల కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమన్నారు. గ్రామాల అభవృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల కన్వీనర్‌ నూతేటి వెంకటేశులు, టీడీపీ నాయకులు నారాయణస్వామి, దస్తగిరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:00 AM