AP roads: ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో...?
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:52 PM
నగరంలో అత్యంత ప్రధానమైన రహదారులలో పీటీసీ ఫ్లైఓవర్ బ్రిడ్జి ముఖ్యమైనది. కేంద్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.311.93 కోట్లు వెచ్చింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయితే ఈ బ్రిడ్జికి ఒకవైపు (శాంతి థియేటర్, బెంగుళూర్ బేకరీ షాపు వైపు) సర్వీస్ రోడ్డు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేయకపోవడంతో అవస్థల నడుమ వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.
అనంత నడిబొడ్డు టవర్‌క్లాక్ వద్ద దుస్థితి... రాకపోకలకు తీవ్ర అంతరాయం
అనంతపురం సిటీ, ఏప్రిల్ 24 : నగరంలో అత్యంత ప్రధానమైన రహదారులలో పీటీసీ ఫ్లైఓవర్ బ్రిడ్జి ముఖ్యమైనది. కేంద్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.311.93 కోట్లు వెచ్చింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయితే ఈ బ్రిడ్జికి ఒకవైపు (శాంతి థియేటర్, బెంగుళూర్ బేకరీ షాపు వైపు) సర్వీస్ రోడ్డు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేయకపోవడంతో అవస్థల నడుమ వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, మేయర్ తదితర ప్రజాప్రతినిధులకు నిత్యం ఈ సమస్య కనిపిస్తున్నా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.
కొందరు ప్రైవేట్ స్థలాల వ్యక్తులు పనులు చేస్తుంటే.. ఆ రోడ్డుపైకి దుమ్ము లేస్తోంది. ఆయినప్పటికి ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మాత్రం.. బ్రిడ్జిని అన్ని హంగులతో పూర్తి చేశాం.. త్వరలోనే ఈ సర్వీస్ రోడ్డును పూర్తి చేస్తాం అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని నగర వాసులు విమర్శిస్తున్నారు. వాహనచోదకులు, పాదచారుల, సర్వీస్ రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యజమానుల పరిస్థితి ఏమిటో ఈ చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. ఈ రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉండటంలో ఏమాత్రం వ్యాపారాలు జరగడం లేదని వాపోతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...