Share News

STU ఉపాధ్యాయులపై ‘అపార్‌’ ఒత్తిడి తగదు: ఎస్టీయూ

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:19 AM

అపార్‌ ఐడీ నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం తగదని, వాటి కార్డుల జారీ కోసం ఆధార్‌ సవరణ కేంద్రాలను జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం వారు ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు.

STU  ఉపాధ్యాయులపై ‘అపార్‌’ ఒత్తిడి తగదు: ఎస్టీయూ
సభ్యత్వ నమోదు చేస్తున్న ఎస్టీయూ నాయకులు

కళ్యాణదుర్గంరూరల్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): అపార్‌ ఐడీ నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం తగదని, వాటి కార్డుల జారీ కోసం ఆధార్‌ సవరణ కేంద్రాలను జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం వారు ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో భాగంగా ఒకే దేశం, ఒకే ఐడెంటిటీ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులకు ఐడీ క్రియేట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం అపార్‌ కార్డులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకు విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, ఆధార్‌ నంబర్‌, అడ్మిషన రిజిస్టర్‌ యూ డైస్‌లో ఒకేలా ఉన్నప్పుడే ఐడీ క్రియేట్‌ అవుతుందన్నారు. అయితే ప్రతి పాఠశాలలో మెజారిటీ విద్యార్థులకు వివరాలు సరిపోలడం లేదని, వాటిని సవరించుకోవడానికి ఆధార్‌ సవరణ కేంద్రాలు అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. ఈ క్రమంలో అపార్‌ ఐడీ నమోదుతో ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతోందన్నారు. నెల రోజులుగా వారు ఈ ప్రక్రియతో తిప్పలు పడుతున్నారన్నారు. మరోవైపు ఎస్‌ఏ ఎంపీ 2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులపై ఆపార్‌ నమోదు వేగవంతం చేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని అన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ఆధార్‌ సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, యూడై్‌సలో సవరణలను పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల ద్వారా సవరించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఆపార్‌ నమోదు గడువు పెంచాలని, సరైన ఆధారాలతో అడ్మిషన రిజిస్టర్లో వివరాలు సవరించుకోవడానికి అవకాశం కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎన రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 06 , 2024 | 01:19 AM