Share News

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

ABN , Publish Date - May 27 , 2024 | 12:20 AM

జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్‌)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)...

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

కర్ణాటకలో వర్షాలు.. రిజర్వాయర్‌కు వరద నీరు

ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశ

గుమ్మఘట్ట, మే 26: జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్‌)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)


రిజర్వాయర్‌కు నీరు చేరవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టులో కాలువల మరమ్మతులు చేయకపోవడం, ముళ్లకంపలు పెరిగిపోవడం తదితర కారణాలతో చివరి ఆయకట్టుకు నీరందండం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇరిగేషన అధికారులు సాగునీటి విడుదల సమయంలో వారంరోజుల ముందు కాలువ మరమ్మతులు తూతూ మంత్రంగా చేపట్టి నీటిని విడుదల చేస్తుండటంతో ప్రతి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముందస్తుగానే అధికారులు ప్రాజెక్ట్‌ స్థితిగతులు, కాలువల మరమ్మతులు చేపట్టి సక్రమంగా సాగునీటిని అందించాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పరిధిలో సిబ్బంది కొరత వల్ల ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడం లేదని, సిబ్బందిని నియమించి రైతుల పంటలను కాపాడాలని వారు కోరుతున్నారు.


మరమ్మతులు చేయించాలి: కుమారయ్య, రైతు, రంగచేడు

చివరి ఆయకట్టుకు నీరందాలంటే అధికారులు ముందుగా కాలువల మరమ్మతులు చేపట్టాలి. అలా చేస్తే సాగునీరు వృథా కాకుండా రైతుల పొలాలకు చేరుతుంది. కాలువల్లో ముళ్ల కంపలు పెరిగిపోవడంతో సాగునీరు విడుదలైన ప్రతి ఏటా చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోతున్నాం.

లస్కర్లను నియమించాలి : వెంకటేశులు, రైతు, కలుగోడు

సాగునీటి డిసి్ట్రబ్యూటరీల నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు గతంలో ఇరిగేషన శాఖ ప్రత్యేక లస్కర్లను ఏర్పాటు చేసింది. తద్వారా నీటి వృథాను అరికడుతూ ప్రతి రైతుకు సాగునీరు అందించేవారు. ప్రస్తుతం లస్కర్లు ఉద్యోగ విరమణ పొందడంతో ఐదేళ్లుగా రిజర్వాయర్‌లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. వెంటనే లస్కర్లనునియమించాలి


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 27 , 2024 | 12:21 AM