YCP OFFICE : అట్లెట్ల కడుతున్నారు..? ఆపేయండి..!
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:15 AM
నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయం వ్యవహారంపై నగరపాలిక టౌన ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ప్లాన అప్రూవల్ లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారనే కారణం చూపుతూ శనివారం నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకున్నా.. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు స్పందించలేదు. నగరపాలిక కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ శనివారం సాయంత్రం 5 గంటలకు నోటీసులు ఇచ్చారు. ...
అనంతపురం క్రైం, జూన 22: నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయం వ్యవహారంపై నగరపాలిక టౌన ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ప్లాన అప్రూవల్ లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారనే కారణం చూపుతూ శనివారం నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకున్నా.. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు స్పందించలేదు. నగరపాలిక కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ శనివారం సాయంత్రం 5 గంటలకు నోటీసులు ఇచ్చారు. ‘అనుమతులు లేకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. తక్షణమే పనులను ఆపేయండి. చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఏడు రోజుల్లోగా
చెప్పండి..’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు స్పందన లేకపోతే మరో నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు 24 గంటలు సమయం మాత్రమే ఉంటుంది. సరైన స్పందన లేకపోతే ఆ భవనాన్ని కూల్చివేసే అధికారం నగరపాలిక అధికారులకు ఉంటుంది. అప్రూవల్ తీసుకోకుండా వ్యవహారం నడిపిన వైసీపీ నేతలు, ఖాళీ స్థల పన్ను కూడా ఆలస్యంగానే చెల్లించారు. అప్రూవల్‌కు ముందు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్‌టీ) రూ.7.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. తొలుత రూ.30 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులు అడిగినా పట్టించుకోలేదట. పార్టీ అధికారం కోల్పోవడంతో ఈ నెల 17న మిగిలిన రూ.7 లక్షలు చెల్లించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....