RALLY : ‘దేవాలయాలపై దాడులు ఆపాలి’
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:30 AM
బంగ్లాదేశలో హిందువులపై, దేవాలయాలపై దాడులను వెంటనే ఆపాలని హిందూ సం ఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అలాగే కోల్కతాలో వైద్య విద్యా ర్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ... హిందువులు శాంతి కాముకులని, ఎవరి జోలికి వెళ్లరన్నారు. అలాంటి వారిపై బంగ్లాదేశలో అల్లరి మూకలు పైశాచికంగా ప్రవర్తించడం దారుణమన్నారు.
హిందూపురం అర్బన, ఆగస్టు 23: బంగ్లాదేశలో హిందువులపై, దేవాలయాలపై దాడులను వెంటనే ఆపాలని హిందూ సం ఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అలాగే కోల్కతాలో వైద్య విద్యా ర్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ... హిందువులు శాంతి కాముకులని, ఎవరి జోలికి వెళ్లరన్నారు. అలాంటి వారిపై బంగ్లాదేశలో అల్లరి మూకలు పైశాచికంగా ప్రవర్తించడం దారుణమన్నారు. అదే దేవాలయాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడం నీచమన్నారు. అదే విధంగా కోల్కతాలో సభ్య సమాజం తలదించుకునేలా వైద్య విద్యార్థిని పట్ల అతి కిరాతంగా ప్రవర్తించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యకమ్రంలో హిందూ సంఘాల సభ్యులు, యువత, మహిళలు కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....