Collector : హెచఐవీకి అవగాహనే మందు: కలెక్టర్
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:52 PM
హెచఐవీ, ఎయిడ్స్ నివారణకు అవగాహనే మందు అని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం 5కె రెడ్ రన మారథాన నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఈ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. హెచఐవీ, ఎయిడ్స్‌కు చికిత్స లేదని, అవగాహన పెంచుకుంటే ఈ వ్యాధిబారిన పడకుండా ఉండగలమని అన్నారు. హెచఐవీ, ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపరాదని జేసీ శివనారాయణశర్మ అన్నారు. బాధితులకు వైద్యం, మందులను ప్రభుత్వ ...
అనంతపురం టౌన, ఆగస్టు 29: హెచఐవీ, ఎయిడ్స్ నివారణకు అవగాహనే మందు అని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం 5కె రెడ్ రన మారథాన నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఈ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. హెచఐవీ, ఎయిడ్స్‌కు చికిత్స లేదని, అవగాహన పెంచుకుంటే ఈ వ్యాధిబారిన పడకుండా ఉండగలమని అన్నారు. హెచఐవీ, ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపరాదని జేసీ శివనారాయణశర్మ అన్నారు. బాధితులకు వైద్యం, మందులను ప్రభుత్వ
ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మారథాన విజేతలు నవీన, రవితేజ, శిరీషా, అశ్రీఫాకు, ట్రాన్సజెండర్ విభాగంలో సత్య, మెహర్‌కు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్, క్లస్టర్ పోగ్రామ్ మేనేజరు భాస్కర్, డాక్టర్ సుజాత, ప్రిన్సిపాల్ దివాకర్‌రెడ్డి, జిల్లా సూపర్‌వైజర్ జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....