Share News

SP RATNA: పౌర హక్కులపై అవగాహన అవసరం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:05 AM

పౌరహక్కులపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎ. రత్న పేర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీకాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.

SP RATNA: పౌర హక్కులపై అవగాహన అవసరం
Speaking SP Ratna

కదిరి అర్బన, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పౌరహక్కులపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎ. రత్న పేర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీకాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. భంగం కలిగించినవారు ఎవరైనా సరే శిక్షార్హులవుతారన్నారు. కులవివక్ష, అంటరానితనం, వృద్ధులు, మైనార్టీ, దళిత, వెనుకబడిన, సమాన ఉపాధి హామీ తదితర హక్కుల గురించి వివరించారు. కులమతాలకు అతీతంగా అందరు కలిసి ఉండాలని సూచించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రాజ్యాం గం హక్కులు కల్పించిందన్నారు. వీటిని అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీఎస్‌ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీఓ పొలప్ప, సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్ర, జిల్లా విజిలెన్స మానటరింగ్‌ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, రాంప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:05 AM