PINWOR M ; కత్తెర పురుగు నివారణపై అవగాహన
ABN , Publish Date - Jul 22 , 2024 | 11:47 PM
మండలంలోని రైతులు సాగుచేసిన మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జాన్సన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంటను కత్తెర పురుగును ఆశించడంతో దాని నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొక్కజొన్న సాగుచేసిన తరువా త తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పంటకు వాడాల్సిన మందులను ఆయన వివరించారు.
లేపాక్షి, జూలై 22 : మండలంలోని రైతులు సాగుచేసిన మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జాన్సన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంటను కత్తెర పురుగును ఆశించడంతో దాని నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొక్కజొన్న సాగుచేసిన తరువా త తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పంటకు వాడాల్సిన మందులను ఆయన వివరించారు. అలాగే వేరుశనగ, వరి పంటల్లో యాజమాన్య పద్ధతులతో పాటు పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ, విత్తనశుద్ధి, ఎరువుల ఉపయోగం గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య, వ్యవసాయశాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....