Share News

helmet హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:13 AM

హెల్మెట్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలపై డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు పట్టణంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

helmet హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీ
ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

తాడిపత్రి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలపై డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు పట్టణంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి, ఎస్‌ఐ కాటయ్య, పట్టణ ఎస్‌ఐ గౌస్‌బాషా హెల్మెట్‌ ధరించి ద్విచక్రవాహనాలపై రూరల్‌ పోలీ్‌సస్టేషన నుంచి పట్టణంలోని నందలపాడుబ్రిడ్జి వరకు అక్కడి నుంచి రూరల్‌ పోలీ్‌సస్టేషనకు ర్యాలీ నిర్వహించారు. ద్విచక్రవాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. ర్యాలీలో పెద్దపప్పూరు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 31 , 2024 | 01:13 AM