Share News

TILAK: ఘనంగా బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి

ABN , Publish Date - Aug 01 , 2024 | 11:56 PM

దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ 103వ జయంతిని గురువారం సాయంత్రం స్థానిక విశాలాంధ్ర బుక్‌హౌస్‌ వద్ద తెలుగు వెలుగు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు టీవీ రెడ్డి మాట్లాడుతూ... భాష ఎంత మెత్తనిదో భావాలు అంత పదునైనవని పేర్కొన్నారు.

TILAK: ఘనంగా బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి
A scene honouring literary servants

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 1: దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ 103వ జయంతిని గురువారం సాయంత్రం స్థానిక విశాలాంధ్ర బుక్‌హౌస్‌ వద్ద తెలుగు వెలుగు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు టీవీ రెడ్డి మాట్లాడుతూ... భాష ఎంత మెత్తనిదో భావాలు అంత పదునైనవని పేర్కొన్నారు. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలాభాగం తిలక్‌ కరతలామలకమేనని పేర్కొన్నారు. అనంతరం 4 దశాబ్దాలుగా సాహితీసేవ చేస్తున్న విశాలాంధ్ర బుక్‌హౌస్‌ మాజీ మేనేజర్‌ చెట్ల ఈరన్న, ప్రస్తుత మేనేజర్‌ శ్రీనివాసులుకు జ్ఞాపికలు బహూకరించి సత్కరించారు. గుర్రం జాషువా సాహిత్యపీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య, అనంత సాహితీ ప్రస్థానం ట్రస్టు అధ్యక్షుడు గంగిరెడ్డి అశ్వత్థరెడ్డి, ఎస్కేయూ తెలుగుశాఖ అకడమిక్‌ కన్సల్టెంట్‌ నానీల నాగేంద్ర, పూజారి ఈరన్న, షేక్‌ రియాజుద్దీన, ఆకుల రఘురామయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 11:56 PM