HOSPITAL: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:49 PM
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి జోనల్ మలేరియా అధికారి డాక్టర్ లక్ష్మానాయక్ ఆదేశించారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు 4: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి జోనల్ మలేరియా అధికారి డాక్టర్ లక్ష్మానాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాకురాగా నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. నీరు నిల్వ, దోమలు పెరగడానికి కారణమైన లార్వా తదితర వాటిని స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లావైద్యశాఖ కార్యాలయంటో డీఎంఓ విభాగంతో సమావేశం నిర్వహించి చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఈ సీజనలో మలేరియా, డెంగీ, చికున గున్యా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి దోమలేకారణమని ఆ దోమలు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిదీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల వల్లవచ్చే జబ్బుల గురించి సరైన అవగాహన ప్రజలలో వచ్చినపుడే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ త్యాగరాజు, డీఎం ఓబులు, అసిస్టెంట్ డీఎంఓ సత్యనారాయణ, ఆరోగ్యవిస్తరణాధికారి నిత్యపూజయ్య, మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్ మద్దయ్య, నూర్‌బాషా, శ్రీధర్ పాల్గొన్నారు.