crop పంటలకు సోకే తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:40 AM
వేరుశనగ, ఆముదం, కంది పంటలకు సోకే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్ర ం శాస్త్రవేత్త శిరీష సూచించారు. మండలంలోని ఆవులదట్ల గ్రామంతో పాటు డీ.హీరేహాళ్ మండలంలోని మురిడి, కల్యం గ్రామాల్లో గల పంటలను గురువారం ఆమె పరిశీలించారు.
రాయదుర్గం రూరల్, సెప్టెంబరు 19: వేరుశనగ, ఆముదం, కంది పంటలకు సోకే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్ర ం శాస్త్రవేత్త శిరీష సూచించారు. మండలంలోని ఆవులదట్ల గ్రామంతో పాటు డీ.హీరేహాళ్ మండలంలోని మురిడి, కల్యం గ్రామాల్లో గల పంటలను గురువారం ఆమె పరిశీలించారు.
పంటలకు పలు తెగుళ్లు సోకడాన్ని గుర్తించిన ఆమె వాటి నివారణకు రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వేరుశనగలో ప్రస్తుతం ఉన్న బెట్ట ను అధిగమించడానికి లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. కందిపంటకు వెర్రి తెగులు రాకుండా ముందస్తుగా ప్రోపర్గైట్ అనే మందును ఎకరానికి 400 మి.లీల చొప్పున పిచికారీ చేయాలన్నారు. ఆముదం పంటలో తెల్లదోమ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో అనంతపురం నుంచి సహాయ వ్యవసాయ సంచాలకుల శైలజకుమారి, వ్యవసాయాధికారి శంకర్‌లాల్‌నాయక్, ఏఈఓ ప్రసాద్, మండల వ్యవసాయాధికారి మహేంద్ర, ఆర్‌ఎ్‌సకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..