Share News

SP : ప్రజలకు మెరుగైన సేవలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 11:30 PM

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీ్‌సకాన్ఫరెన్స హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ...

SP : ప్రజలకు మెరుగైన సేవలు
KV Muralikrishna is taking charge as SP

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

నూతన ఎస్పీ మురళీ కృష్ణ.. బాధ్యతల స్వీకరణ

అనంతపురం క్రైం, జూలై 18: జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీ్‌సకాన్ఫరెన్స హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం


ఆనందంగా ఉందని అన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు బేసిక్‌ పోలీసింగ్‌లో భాగమైన అంశాలపై దృష్టి పెడతామని అన్నారు. గంజాయి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయి రవాణా, విక్రేతలు, వినియోగదారులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని, నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తామని అన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, వారిపై నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. మెరుగైన సేవల కోసం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కళాశాలలు, పరిశ్రమల యాజమాన్యాల సహకారం తీసుకుంటామని అన్నారు. పోలీస్‌ సిబ్బంది, అధికారులు, వారి కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, డీఐజీ షిమోషిని ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి, రామకృష్ణ, పోలీస్‌ అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు ప్రతాప్‌, శ్రీనివాసులు, శివభాస్కర్‌రెడ్డి, జనార్దననాయుడు, శివారెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ మునిరాజ, పోలీస్‌ కార్యాలయ ఏఓ శంకర్‌, సీఐలు ఇందిర, షేక్‌ జాకీర్‌, రెడ్డప్ప, క్రాంతికుమార్‌, ధరణికిషోర్‌, ప్రతా్‌పరెడ్డి, నారాయణరెడ్డి, ఇస్మాయిల్‌, వెంకటేష్‌ నాయక్‌, రామకృష్ణారెడ్డి, దేవానంద్‌, నరేంద్రరెడ్డి, మునిస్వామి, సంజీవులు, వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌, హరినాథ్‌, నాగరాజు తదితరులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 18 , 2024 | 11:30 PM