DURGADEVI : దుర్గమ్మకు బోనాలు
ABN , Publish Date - Aug 05 , 2024 | 12:06 AM
ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ఆదివారం పట్టణంలోని దుర్గమ్మదేవికి భక్తులు బోనాలు సమర్పించారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మహిళలు చౌడేశ్వరి దేవి కట్ట నుంచి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా దుర్గమ్మ అలయానికి వెళ్లారు. బోనాలను అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల ఎదుట నిమ్మకాయలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
ధర్మవరం, ఆగస్టు 4: ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ఆదివారం పట్టణంలోని దుర్గమ్మదేవికి భక్తులు బోనాలు సమర్పించారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మహిళలు చౌడేశ్వరి దేవి కట్ట నుంచి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా దుర్గమ్మ అలయానికి వెళ్లారు. బోనాలను అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల ఎదుట నిమ్మకాయలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ వాసులు బాలెం ఓబుళేశు, గంగాధర్, చంద్ర పాల్గొన్నారు.
గ్రామదేవతలకు ...
ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగల్లు గ్రామంలో గ్రామదేవతలు గంగమ్మ, పెద్దమ్మకు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆదివారం జ్యోతులు, బోనాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు జ్యోతులు, బోనాలను యలవ గంపల్లో పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. అలాగే పొట్టేళ్లు బలిచ్చారు. మహిళలు ఒడిబియ్యం, గాజులు, పూలు, పసుపు, కుంకుమ సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....