DIARRIHEA: విజృంభిస్తున్న డయేరియా..!
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:45 PM
మండలంలో డయేరియా విజృంభిస్తోంది. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్నతికి పరుగులు పెడుతున్నారు. ప్రతి గ్రామంలో నుంచి శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డయేరియా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు.
శింగనమల, జూలై 4: మండలంలో డయేరియా విజృంభిస్తోంది. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్నతికి పరుగులు పెడుతున్నారు. ప్రతి గ్రామంలో నుంచి శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డయేరియా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. చాలా మంది బాధితులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. మండలంలోని గ్రామాల్లో వారం నుంచి ప్రతి రోజు ప్రభుత్వ ఆస్పత్రిలో 40 నుంచి 50 మంది వరకు బాధితులు చికిత్సకు వస్తున్నట్లుఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం శింగనమల, సలకంచెరువు, పెరవలి, శివపురం, గురుగుంట్ల తదితర గ్రామాల నుంచి బాధితులు ఎక్కవగా వచ్చినట్లు తెలుస్తోంది.
అవగహన కల్పిస్తున్నాం
- వైద్యాధికారి శంకర్ నాయక్
గ్రామాల్లో డయేరియాపై అవగహన కల్పిస్తున్నాం. వ్యాధి పోకిన వారు భయపడే అవసరం లేదు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాలి. వ్యాధి వచ్చిన వారు ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు తాగడం మంచిది. వాతవరణ కాలుష్యం వల్లనే ఈ వ్యాధి వస్తుంది.