Home » Singanamala
అసలే వేసవికాలం. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో మండలంలోని కుంటలు, చెరువుల్లో నీరు లేదు. మూగజీవాల దాహం తీర్చే నీటి తొట్టెలు కనబడడంలేదు. దీంతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గొర్రెల కాపర్లు, రైతుల తిప్పలు వర్ణనా తీతం. వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్‌కార్డులు ఉన్నాయి.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.
మండలంలోని కల్లూరు సమీపంలోని తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమయ్యింది. పోలీసులు తెలిపిన మేరకు రాజస్థాన రాష్ట్రంలోని మైరైనా జిల్లాకు చెందిన డ్రైవర్ గాంధార్ సింగ్, క్లీనర్ రామ్ధీర్ ఇద్దరు ఈనెల 20న గోధుమల లోడుతో బెంగళూరుకు బయల్దేరారు.
‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు.
మండల పరిధిలోని సి.బండమీదపల్లి బీసీ కాలనీ వాసులు తాగునీటిని డ్రిప్పు వైరు ద్వారా పట్టు కోవాల్సి వస్తోంది. గ్రామంలో జరిగిన జాతీయ రహదారి పనుల సమయంలో బీసీ కాలనీ చెందిన తాగునీటి పైపులైన్లు చాలా మటుకు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు ఊరు చివర కొంత బాగున్న పైపు లైనకు డ్రిప్పు వైరు తగిలించుకుని తాగునీటిని పట్టుకుంటున్నారు.
సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్‌స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.