KALAVA CAMPAIN: సూపర్‌సిక్స్ పథకాలతో ఉజ్వల భవిష్యత్తు: కాలవ
ABN , Publish Date - May 06 , 2024 | 11:34 PM
సూపర్‌సిక్స్ పథకాలతో రాష్ట్రానికి ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.
డీ.హీరేహాళ్, మే 6: సూపర్‌సిక్స్ పథకాలతో రాష్ట్రానికి ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండల వ్యాప్తంగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. మండలంలోని మడేనహళ్లి, లింగమనహళ్లి, తమ్మేపల్లి, చెర్లోపల్లి, ఓబుళాపురం, సిద్ధాపురం, హెచఎ్‌స తండా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్ పథకాలను, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అరాచక పాలనను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామాలలో రోడ్‌షో నిర్వహించారు. కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
టీడీపీ హాయంలో వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజలు ఈ ఎన్నికలలో టీడీపీకీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
50 కుటుంబాలు టీడీపీలో చేరిక
రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని రంగసముద్రం గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. సర్పంచ చంద్రశేఖర్, రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి, అశోక్, బోయ బొమ్మన్న, బోయ బాబు, శివలింగ తదితరులు చేరారు.
కుటుంబీకుల ప్రచారం: కాలవ శ్రీనివాసులును గెలిపించాలని ఆయన కూతురు గౌతమి, కణేకల్లు మండలంలోని గరుడచేడు, మీనహళ్లి, బిదురకుంతం, కొడుకు కాలవ భరత బొమ్మనహాళ్ మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో ప్రచారం చేశారు.
దళిత ద్రోహి జగనకు బుద్ధి చెప్పండి
కణేకల్లు: దళితుల మీద అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిపించిన వైసీపీ అధినాయకుడు జగనకు బుద్ధి చెప్పాలని ఎస్సీసెల్ అధికార ప్రతినిధి అంజిబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల జీవన ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేసి దాదాపు 27 సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి దళితులు మద్ధతు పలకాలని ఆయన కోరారు.