CANDILIGHT RALLY: వైద్యురాలి హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
ABN , Publish Date - Aug 17 , 2024 | 12:06 AM
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వైద్యురాలిని అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీపీఐ, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు.
అనంతపురం విద్య, ఆగస్టు 16: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వైద్యురాలిని అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీపీఐ, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. నగరంలోని పాతూరు గాంధీ విగ్రహం దగ్గర కొవ్వొత్తులు ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ... ట్రైనీ డాక్టర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. మెడికల్ కాలేజ్‌లో అర్ధరాత్రి వరకూ డ్యూటీ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోడానికి వెళ్లిన ఆమె ఉదయం నగ్నశవంగా కనిపించిందన్నారు. తల్లిదండ్రులు, తోటి డాక్టర్లు సమ్మెకు దిగితే కానీ పోస్టుమార్టం చేయలేదని, ఆత్మహత్యగా చితీక్రరించాలని చూశారంటూ మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు రమణ, అల్లిపీరా, సంతో్‌షకుమార్‌్, చాంద్‌బాషా, సుందర్‌రాజు, ప్రసాద్, మునాఫ్, శ్రీనివాస్, రహంతుల్లా, యశోదమ్మ, చందు పాల్గొన్నారు.
నిందితులను అరెస్టు చేయాలి: కోల్‌కతాలో విధుల్లో ఉన్న డాక్టర్‌పై అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐఎ్‌సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం కోశాధికారి హనుమంతు, సాయి స్వరూప, రాధాజ్యోతి, మంజునాథ్, ఉమమహేష్, వంశీ పాల్గొన్నారు.
హంతకులను కఠినంగా శిక్షించాలి
అనంతపురం క్లాక్‌టవర్: కోల్‌కతాలో జూనియర్ మహిళా డాక్టర్‌ను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని స్త్రీవిముక్తి సంఘటన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ, లక్ష్మి డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాకాండపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలపై హింసను ప్రేరేపించే మద్యం, మత్తు పదార్థాలు, పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలన్నారు. దాడికి నిరసనగా 17వ తేదీ నుంచి 24గంటల పాటు వైద్యసేవలను నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునకు సంఘీభాన్ని తెలిపారు.