Share News

GUMMANURU: రెండు ఓట్లూ కూటమి అభ్యర్థులకు వేయండి

ABN , Publish Date - May 04 , 2024 | 10:55 PM

న్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఉదయం పట్టణంలోని 6, 7, 8, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.

GUMMANURU: రెండు ఓట్లూ కూటమి అభ్యర్థులకు వేయండి
పాతగుంతకల్లులో ప్రచారం నిర్వహిస్తున్న గుమ్మనూరు

ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, మే 4: ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఉదయం పట్టణంలోని 6, 7, 8, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదని, ఉద్యోగాలు రావాలంటే యువత టీడీపీకి ఓటు వెయ్యాలని కోరారు. కార్యక్రమంలో బండారు ఆనంద్‌, తలారి మస్తానప్ప, కోడి శీన, బండారు నగేశ, కంబగిరి రాము పాల్గొన్నారు. సాయంత్రం జయరాం 31, 32 వార్డుల్లో ప్రచారం చేశారు. మండలంలోని చింతలాంపల్లి, వెంకటాంపల్లి, నెలగొండ గ్రామాల్లో గుమ్మనూరు శ్రీనివాసులు ప్రచారం చేశారు. నాయకులు గుమ్మనూరు వెంకటేశులు రామయ్య, రామాంజనేయులు, బొజ్జేనాయక్‌ పాల్గొన్నారు.


గుత్తి: టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం తరపున శనివారం పట్టణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. వార్డుల్లో అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు చేపట్టారు. 1, 4, 5 వార్డులలో ఆలూరు మార్కెట్‌ యార్డు చైర్మన గుమ్మనూరు నారాయణ, ఆయన సతీమణి కమలమ్మ ఇంటింటికి తిరిగి జయరాంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


పామిడి: మండలంలోని కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, ఖాదర్‌పేట గ్రామాలలో శనివారం టీడీపీ నాయకులు ప్రచారం ముమ్మరంగా సాగింది. గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి కుమారుడు మ హేంద్ర ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమం గా అందుతాయన్నారు. నాయకులు గంగాధర్‌ యాదవ్‌, రామాంజనేయు లు యాదవ్‌, సోమనాథ్‌ రెడ్డి, హరి, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 10:55 PM