LAWYERS: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంబరాలు
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:51 PM
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడంతో పట్టణంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో వారు కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు.
కళ్యాణదుర్గం, జూన 14: వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడంతో పట్టణంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో వారు కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో పేద ప్రజలు ఎంతో ఉపశమనం పొం దారన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చంద్రబాబునాయుడు ఈ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. న్యాయవాదులు, బార్ అసోసియేషన సభ్యులు పాల్గొన్నారు.
తాడిపత్రిటౌన: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దుచేయడం హర్షణీయమని ఏపీ రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజారామిరెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొని ఉండేవన్నారు. ఎన్నికల్లో కూటమి గెలవడం టైటిలింగ్ యాక్ట్‌ను రద్దుచేస్తూ ఐదు సంతకాల్లో ఒకటి కావడం ప్రజలకు సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.
రాయదుర్గం: ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో న్యాయవాదులు లోకానంద, నాగరాజు, హరికృష్ణ, జాన్సనల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
బొమ్మనహాళ్: జగన ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని సీఎం చంద్రబాబునాయుడు రద్దు చేయడం హర్షణీయమని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు యర్రగుంట్ల వెంకటేశులు, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌పీ నాగరాజు అన్నారు. శుక్రవారం వారు టీడీపీనాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలిగించే చ ట్టాన్ని తీసుకొచ్చి జగన అన్నదాతలను నట్టేట ముంచేశాడనన్నారు. మండల కన్వీనర్ బలరాంరెడ్డి, సింగల్ విండో మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లికార్జున, అప్పారావు, మహేంద్ర, పయ్యావుల అనిల్, పయ్యావుల మోహన, పయ్యావుల నాగరాజు, నవీన, సైకిల్‌షాప్ హనుమంతు, క్లస్టర్ కన్వీనర్ మాలపాటి ధనుంజయ, మాజీ సర్పంచ కేశప్ప పాల్గొన్నారు.
గుంతకల్లుటౌన: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసిన సందర్భంగా పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్డులో బార్ అసోసియేషన కార్యాలయంలో శుక్రవారం టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీఎస్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచారు. న్యాయవాదులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు మూడు నెలలు ఉద్యమం చేపట్టారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే రెండవ సంతకం చేసి ల్యాండ్ చట్టాన్ని రద్దుచేస్తానని మాట ఇచ్చారన్నారు. న్యాయవాదులు భాస్కర్‌గౌడ్, వెంకట్‌నాయుడు, నాగశేషు, బడేసాబ్, లక్ష్మీనారాయణ, విద్యాసాగర్, హేమాద్రి, చెన్నకేశవులు, ధనుంజయ, పత్తికొండనాగరాజు, రవీంద్రకుమార్ పాల్గొన్నారు.