Share News

one hundred days rule చంద్రబాబు వంద రోజుల పాలన సక్సెన

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:43 AM

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు విజయవంతంగా పూర్తవడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పట్టణంలోని 29వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

one hundred days rule   చంద్రబాబు వంద రోజుల పాలన సక్సెన
రాయదుర్గంలోని సమావేశంలో ఇదిమంచి ప్రభుత్వం పోస్టర్‌ను చూపుతున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంటౌన, సెప్టెంబర్‌ 20: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు విజయవంతంగా పూర్తవడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పట్టణంలోని 29వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిందన్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశను అగ్రగామిగా నిలపాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్లను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారన్నారు. అలాగే మెగా డీఎస్సీతో 16437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తొలి సంతకం చేశారన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసిందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు టంకశాల హనుమంతు, సంపతకుమార్‌, పురుషోత్తం, ఇనాయత, ఫకృద్ధీన, వివిధ శాల అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 21 , 2024 | 12:43 AM