Share News

GUMMANURU: ఆదరించండి.. అండగా ఉంటా: గుమ్మనూరు

ABN , Publish Date - May 06 , 2024 | 12:19 AM

ఎన్నికల్లో తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఐదేళ్లూ అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. ఆదివారం ఉదయం పాతగుంతకల్లులోని వాల్మీకి సర్కిల్‌ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ప్రధాన రహదారిలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలలో ప్రచారం చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు.

GUMMANURU: ఆదరించండి.. అండగా ఉంటా: గుమ్మనూరు
పాత గుంతకల్లులో ప్రచారం నిర్వహిస్తున్న జయరాం

గుంతకల్లు, మే 5: ఎన్నికల్లో తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఐదేళ్లూ అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. ఆదివారం ఉదయం పాతగుంతకల్లులోని వాల్మీకి సర్కిల్‌ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ప్రధాన రహదారిలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలలో ప్రచారం చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు. జయరాం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి సివిల్‌ సప్లయిస్‌ గోడౌనను ఎఫ్‌సీఐ నుంచి ప్రైవేటు గోడౌనగా మార్చారని, దానివల్ల ఎందరో హమాలీలకు ఉపాధి లేకుండాపోయిందన్నారు. తాను గెలిచిన తర్వాత సివిల్‌ సప్లయిస్‌ గోడౌనను యథాతథంగా ఎఫ్‌సీఐకి తరలిస్తానన్నారు. కాలువగట్టు ఏరియాలో వంతెన, డ్రెయిన, రోడ్డు సమస్యలపై దృష్టిసారిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన కోడెల అపర్ణ, నాయకులు పత్తి హిమబిందు, తలారి మస్తానప్ప, తలారి సరోజమ్మ, లక్ష్మీనారాయణ, కోడి శీన, బీ రాము, రామన్న చౌదరి, పూల రమణ పాల్గొన్నారు. సాయంత్రం మార్కెట్‌, మెయిన బజార్‌లో ప్రచారం చేశారు. పట్టణంలోని పలు చర్చిల్లో డన్లప్‌ బాషా ఆధ్వర్యంలో జయరాం ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని గుర్రబ్బాడులో గుమ్మనూరు శ్రీనివాసులు ప్రచారం చేశారు.


గుత్తి: పట్టణంలో గుమ్మనూరు జయరాంను గెలిపించాలంటూ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఆదివారం చర్చిల వద్ద ప్రచారం చేశారు. గుత్తి, గుత్తి ఆర్‌ఎ్‌సలో చర్చిలలో ప్రార్థనలు చేశారు. టీడీపీ నాయకులు దిల్కా శీనా, న్యాయవాది సోమశేఖర్‌, కోనంకి కృష్ణ, వెంకటేష్‌, డాక్టర్‌ జావిద్‌, నారాయణస్వామి, కొనకొండ్ల సూరి పాల్గొన్నారు. పట్టణంలోని గుత్తి ఆర్‌ఎ్‌సలోని 8వ వార్డులో వైసీపీ నాయకులు 20మంది గుమ్మనూరు నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలో స్వాగతించారు. అబ్దుల్‌ వహబ్‌, చంద్ర, చిదంబరం రెడ్డి, ఎండీ రియాజ్‌, తిరుమలయ్య పాల్గొన్నారు.

గుత్తిరూరల్‌: ఈ ఎన్నికల్లో గుమ్మనూరు జయరాంను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని సోదరుడు నారాయణ అన్నారు. మండలంలోని కొత్తపేట, ఎంగిలిబండ, మామిళ్ళచెరువు గ్రామాలల్లో ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్‌ బర్దివలి, నాయకుడు చిన్నరెడ్డి యాదవ్‌, దిల్కా శీనా, సర్పంచు భరత పాల్గొన్నారు.


పామిడి: తెలుగుదేశం పార్టీతోనే మహిళలకు భవిష్యత్తు గ్యారెంటీ అని విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు అప్పన్నగారి కుమార్‌ అన్నారు. పట్టణంలోని 13, 14వ వార్డులు, మండలంలోని దేవరపల్లి, ఓబుళాపురం, సొరకాయలపేట, ఎద్దులపల్లి, రామగిరి గ్రామాల్లో ఆదివారం ప్రచార చేశారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 12:19 AM