MINISTER SAVITHA: క్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శం
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:55 PM
యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు.
పుట్టపర్తి టౌన, డిసెంబరు 21(ఆంధ్ర జ్యోతి): యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకం చేసేవని అన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారధి మాట్లాడుతూ యేసుక్రీస్తు మనుషులను ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని ప్రపంచానికి బోధించిన శాంతి దూత అన్నారు. అనంతరం మంత్రి, ఎంపీ, జిల్లా పరిషత చైర్‌పర్సన గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కలెక్టర్ టీఎస్ చేతన, క్రిస్మస్ కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన అధికారి రామసుబ్బారెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ విజయ్‌కుమార్, పాస్టర్లు డేనియల్, సరేశ్వరరావు, శ్యామ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.