Share News

Collector Chetan బాల్యవివాహాల నిర్మూలన సామాజిక బాధ్యత

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:24 AM

బాల్యవివాహాల నిర్మూలన సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్‌ అధికారులతో కలెక్టర్‌ గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు, సీడీపీఓలు, అంగనవాడీ కార్యకర్తలు, పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు.

Collector Chetan బాల్యవివాహాల నిర్మూలన సామాజిక బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తి టౌన, డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాల నిర్మూలన సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్‌ అధికారులతో కలెక్టర్‌ గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు, సీడీపీఓలు, అంగనవాడీ కార్యకర్తలు, పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 105 బాల్యవివాహాలు నిలుపుదల చేశామన్నారు. ప్రతినెలా డివిజన, మండలస్థాయిలో బాల్యవివాహల నిర్మూలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసిన తల్లిదండ్రులతోపాటు ప్రోత్సహించేవారు కూడా శిక్షార్హులేనన్నారు. చట్టం ప్రకారం యువతికి 18, యువకుడికి 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్‌ పీడీ వరలక్ష్మీ, కదిరి ఆర్డీఓ వీఎస్‌ శర్మ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత పాల్గొన్నారు.

వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు

వయోవృద్ధుల సమస్యలను మానవత్వంతో సంబంధితాఽధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. వయోవృద్ధుల సంక్షేమాధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పోషణ, నిర్వహణ బాధ్యత పట్టించుకోని వారి పిల్లలను పిలిపించి, తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రసూల్‌, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:24 AM