Judas : రండి.. మాట్లాడుకుందాం..!
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:44 AM
కోల్‌కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పది రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు వారిని శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. జూడాలకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీనియర్ వైద్యులు డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్ ...
జూడాలకు సూపరింటెండెంట్ పిలుపు
అనంతపురం టౌన, ఆగస్టు 23: కోల్‌కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పది రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు వారిని శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. జూడాలకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీనియర్ వైద్యులు డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్
నవీనకుమార్, డాక్టర్ రామస్వామితో కమిటీ ఏర్పాటు చేశామని జూడాలకు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడి చర్చలపై నిర్ణయం తీసుకుంటామని జూడాలు తెలిపారు. జూడాల ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రత, వసతి గురించి సూచనలు చేశారు. సీసీ కెమెరాలు, వీధి దీపాలు, రెస్ట్ రూంలలో వసతులపై ఇంజనీరింగ్ అధికారులతో సూపరింటెండెంట్ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ ఆస్పత్రిలో భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో జూడాల నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....