రండి.. మేం చూసుకుంటాం..!
ABN , Publish Date - May 31 , 2024 | 12:40 AM
శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఐసీడీఎస్ అధికారులు తీసుకున్నారు. గ్రామానికి చెందిన చంద్రకళ, తిమ్మరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తిమ్మరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చంద్రకళ ఇటీవల మరణించారు. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు గురువారం గ్రామానికి వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న ప్రభాని(11), రెండో తరగతి ..
శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఐసీడీఎస్ అధికారులు తీసుకున్నారు. గ్రామానికి చెందిన చంద్రకళ, తిమ్మరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తిమ్మరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చంద్రకళ ఇటీవల మరణించారు. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు గురువారం గ్రామానికి వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న ప్రభాని(11), రెండో తరగతి చదువుతున్న అనుశ్రీ(7), ఆరు నెలల బాలుడిని అక్కున చేర్చుకున్నారు. వారి
బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభానిని కేజీబీవీలో చేరుస్తామని, అనుశ్రీని ఆర్డీటీ చైల్డ్‌కేర్ ఇనస్టిట్యూట్‌లో చేరుస్తామని, ఆరుమాసాల బాబును ఐసీడీఎస్ దత్తత విభాగంలో చేరుస్తామని పీడీ తెలిపారు. అధికారుల చొరవ పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కంబదూరు సీడీపీవో వనజ అక్కమ్మ, డీసీపీఓ మంజునాథ్, చైల్డ్‌లైన అధికారులు పాల్గొన్నారు. -అనంతపురం విద్య
మరిన్ని అనంతపురం వార్తల కోసం....