Share News

BULL : రా బసవా.. మా ఇంటికి..!

ABN , Publish Date - May 26 , 2024 | 12:26 AM

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం చిన్ననేలటూరు గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి, గాజుల అమరేశ్వరప్పకు చెందిన ఎద్దును అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్‌ నజీర్‌బాషా రూ.15 లక్షలకు శనివారం కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జరిగిన బండలాగుడు పోటీలలో ఈ ఎద్దు సత్తా చాటినట్లు సమాచారం. ఎ.నారాయణపురంలో సంక్రాంతి ...

BULL : రా బసవా.. మా ఇంటికి..!

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం చిన్ననేలటూరు గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి, గాజుల అమరేశ్వరప్పకు చెందిన ఎద్దును అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్‌ నజీర్‌బాషా రూ.15 లక్షలకు శనివారం కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జరిగిన బండలాగుడు


పోటీలలో ఈ ఎద్దు సత్తా చాటినట్లు సమాచారం. ఎ.నారాయణపురంలో సంక్రాంతి సందర్భంగా ఏటా రాతిదూలం లాగుడు పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి ఇక్కడ జరిగే పోటీలకు ఎద్దులు వస్తుంటాయి. ఇక్కడి రైతు ఒక ఎద్దుకు ఏకంగా రూ.15 లక్షలు వెచ్చించడం విశేషం. ఇది రికార్డు ధర అని చిన్న నేలటూరు గ్రామస్థులు అంటున్నారు.

- గోనెగండ్ల


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 12:26 AM