Share News

SC CLASSIFICATION : సుప్రీం తీర్పు పట్ల సంబరాలు

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:11 AM

ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నా రు. పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో గురువారం ఎమ్మార్పీఎస్‌ నా యకులు రామాంజనేయులు, కోనాపురం పెద్దన్న, బీజేపీ జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

SC CLASSIFICATION : సుప్రీం తీర్పు పట్ల సంబరాలు
MMRPS leaders anointing portraits of Prime Minister Modi and MMRPS Mandakrishna Madiga

పెనుకొండ, ఆగస్టు 1 : ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నా రు. పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో గురువారం ఎమ్మార్పీఎస్‌ నా యకులు రామాంజనేయులు, కోనాపురం పెద్దన్న, బీజేపీ జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోదీ, ఎమ్మార్పీఎస్‌ మందకృష్ణమాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి స్వీట్లు తినిపించారు.

గోరంట్ల: ఎమ్మార్పీఎస్‌, ఎంఈఎఫ్‌ నాయకులు మండలకేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళుల ర్పించారు. కేక్‌ కట్‌ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

చిలమత్తూరు: ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గ విషయమని టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బేకరీ గంగాధర్‌ పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎమ్మార్పీఎస్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు పెద్ద ఎత్తున మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కున్నారు.


స్వీట్లు పంచుకున్నారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.

హిందూపురం(పరిగి) : ఎమ్మార్పీఎస్‌ నాయకులు గురువారం పరిగిలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. స్వీట్లు పంచారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామాంజినప్ప, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

మడకశిరటౌన : పట్టణంలో దళిత సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంచిపెట్టారు. నాయకులు అంజినప్ప, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.

అగళి: ఎమ్మార్పీఎస్‌ మండల నాయకులు మండలకేంద్రంలోని అంబే డ్కర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. బాణసంచా పే ల్చారు. నాయకులు నాగోజీ, క్యాతప్ప, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

గుడిబండ: ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎస్సీసెల్‌ జిలా అధ్యక్షుడు మంజునాథ్‌ తెలిపా రు. కొన్ని దశాబ్దాల కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేయాలని కోరారు.

పావగడ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పుపై పా వగడలోని దళిత సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమం త్రులు క్యాబినెట్‌లో చర్చించి వారి రాష్ట్రాల జనాభాకు అ నుగుణంగా వర్గీకరణ చేయాలని తీర్పు ఇవ్వడంపై సంబరాలు చేసు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 02 , 2024 | 12:11 AM